My first Telugu writing
attempt..(translation of Sadhguru's poem "Of love" https://www.youtube.com/watch?v=VpJVKQS6sps)
ఏ రేఖ మలిచింది నీ ప్రేమ తీరాన్ని
ఏ అడ్డు ఆపింది నీ జాలి కెరటాన్ని
విశ్వాన్ని శాసించే ఆ బ్రహ్మ రాతలా
శూన్యాన
దాగున్న గ్రహ, తారల కక్ష్యలా
సంఘాల,
సంస్క్రుతుల నియమాల కంచెలా
అరచేత
అచ్చైన అస్పష్ట రేఖలా
అహ, పక్షపాతాలు స్రుష్టించు గోడలా
ఏ రేఖ మలిచింది నీ ప్రేమ తీరాన్ని
ఏ అడ్డు ఆపింది నీ జాలి కెరటాన్ని
గడిచేను
జీవితం ఈ వ్యర్ధ స్పర్ధల్లో
సర్వం విస్తరించాలనుకునే తన స్వభావాన్ని గుర్తిస్తే,
సరిహద్దులు ఎరుగడుగా, ప్రేమించే మనిషి.
No comments:
Post a Comment